అక్షరటుడే, వెబ్ డెస్క్: దేశ సర్వోన్నత న్యాయస్థానం తదుపరి చీఫ్ జస్టిస్ గా సంజీవ్ ఖన్నా నియమితులయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ తన వారసుడిగా జస్టిస్ సంజీవ్ ఖన్నాను అధికారికంగా ప్రతిపాదించారు. నవంబర్ 11న తాను పదవీ విరమణ చేస్తున్నందున, జస్టిస్ ఖన్నా తదుపరి సీజేగా ఉంటారని ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ కేంద్ర ప్రభుత్వానికి ఒక కమ్యూనికేషన్‌లో పేర్కొన్నారు. అయితే ఇందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఆమోదం లభిస్తే.. జస్టిస్ ఖన్నా భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులవుతారు.