అక్షర టుడే ఆర్మూర్: సన్న,దొడ్డు వడ్లకు రూ. 500 బోనస్ చెల్లించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అఖిలభారత ప్రగతిశీల రైతు సంఘం ప్రధాన కార్యదర్శి వి.ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఆర్మూర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ మొదటి వారంలో 7139 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చేసిన ప్రకటనును స్వాగతిస్తున్నామన్నారు. సీసీఐ వెంటనే పత్తి పంట కొనుగోలు కేంద్రాలను రూ. 15వేల మద్దతు ధర తో కొనుగోలు చేయాలన్నారు. పత్తికి 500 బోనస్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. వర్షంలో తడిసిన ధాన్యాలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. ఈ సమావేశంలో ఏఐపీకేఎస్ రాష్ట్ర కార్యదర్శి బి. దేవారం తదితరులు పాల్గొన్నారు.
రూ. 500 బోనస్ తో.. ధాన్యాన్ని కొనుగోలు చేయాలి
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : Modi : ప్రధాని మోడీ రాజీనామా..?
Advertisement