అక్షరటుడే, నెట్వర్క్: Ration cards | రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన రేషన్ షాపు(ration shops)ల్లో సన్నబియ్యం పథకం ఉమ్మడి జిల్లాలో మంగళవారం అట్టహాసంగా ప్రారంభమైంది.
ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు షాపుల్లో సన్నబియ్యాన్ని స్వయంగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. పాత బాన్సువాడతో పాటు కొల్లూరులో పోచారం శ్రీనివాస్‌రెడ్డి(pocharam srinivas reddy), ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాల్‌రాజ్(kasula balraj), ఆర్మూర్‌లో నియోజకవర్గ ఇన్‌ఛార్జి వినయ్ రెడ్డి (vinay reddy) తదితరులు పథకాన్ని ప్రారంభించారు.








