అక్షరటుడే, బాన్సువాడ: పట్టణంలో ఈ నెల 27న అధికారికంగా సంత్ సేవాలాల్ జయంతి వేడుకలను నిర్వహించనున్నట్లు బంజారా సేవా సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు బద్యానాయక్ తెలిపారు. ఆదివారం బాన్సువాడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సేవాలాల్ జయంతిని ప్రభుత్వం తొలిసారి నిర్వహించడం హర్షణీయమన్నారు. సమావేశంలో బంజారా నాయకులు ప్రతాప్ సింగ్ రాథోడ్, అంబర్ సింగ్, నరేష్ రాథోడ్, తారాచంద్, రతన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.