అక్షరటుడే, ఇందూరు : జిల్లాలోని పురాతన కట్టడాలను పరిరక్షించాలని సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కు జిల్లా పరిరక్షణ సమితి గౌరవ అధ్యక్షుడు సత్యనారాయణ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో వారసత్వ సంపద ఎంతో ఉందన్నారు. వాటిని ప్రభుత్వం తరఫున పరిరక్షించాలన్నారు. బాల్కొండ ఖిల్లాలో ముళ్లపొదలు పెరిగాయని వాటిని తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో నర్సింగరావు, పవన్ తదితరులున్నారు.