అక్షరటుడే, వెబ్డెస్క్ : SC Classification | తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తూ ప్రభుత్వం జీవో G.O జారీ చేసింది. అంబేడ్కర్ జయంతి Ambedkar Jayanthi సందర్భంగా న్యాయశాఖ జీవో విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో నేటి నుంచి ఎస్సీ వర్గీకరణ అమలులోకి రానుంది. కాగా ఎస్సీ వర్గీకరణ బిల్లును గవర్నర్ Governer ఈ నెల 8న ఆమోదించారు.
వర్గీకరణ జీవోపై సీఎం రేవంత్రెడ్డి CM Revanth REddy ఎక్స్ వేదికగా స్పందించారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయన నివాళులు అర్పిస్తూ ట్వీట్ చేశారు. అంబేడ్కర్ ఆయన సాధన కోసం తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. ఎస్సీ వర్గీకరణతో మూడు దశాబ్దాల పోరాట ఆకాంక్షలు నెరవేర్చామని పేర్కొన్నారు.