అక్షరటుడే, వెబ్‌డెస్క్ : SC Classification | రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ sc classification అమలుకు అంతా సిద్ధం అయిందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా సోమవారం నుంచి రాష్ట్రంలో వర్గీకరణ అమలు చేస్తామన్నారు. కాగా ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ cabinet sub committee ఉపసంఘం చివరి సమావేశం ఆదివారం నిర్వహించారు. చట్టం గురించి తెలిపే జీవోను సోమవారం విడుదల చేసి సీఎం రేవంత్‌రెడ్డికి cm revanth reddy అందజేస్తామని మంత్రి ఉత్తమ్ minister uttam తెలిపారు.
SC Classification | తొలిరాష్ట్రంగా తెలంగాణ
ఎస్సీ వర్గీకరణ కోసం కొన్ని కులాలు ఏళ్లుగా పోరాడుతున్నాయి. ఎట్టకేలకు సుప్రీంకోర్టు వర్గీకరణకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఆయా రాష్ట్రాలు ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరిస్తూ చట్టాలు చేయొచ్చని సుప్రీం తీర్పు చెప్పింది. రేపటి జీవో విడుదల చేస్తే సుప్రీం తీర్పు తర్వాత ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన తొలిరాష్ట్రంగా తెలంగాణ నిలువనుంది.
SC Classification | మూడు గ్రూపులుగా..
రాష్ట్రంలో మొత్తం 59 ఎస్సీ ఉపకులాలు sc sub castes in Telangana ఉన్నాయి. వీటిని మూడు గ్రూపులుగా విభజించనున్నారు. ఎస్సీలకు 15 శాతం ఉన్న రిజర్వేషన్లను sc Reservation ఆయా గ్రూపుల వారీగా పంచనున్నారు. గ్రూప్–1లో అత్యంత వెనుకబడిన 15 కులాలను చేర్చారు. ఈ కులాలకు ఒక శాత రిజర్వేషన్ అమలు చేయనున్నారు. రెండో గ్రూప్‌లో 18 కులాలు ఉండగా ఎస్సీల్లో వారి జనాభా 62శాతంగా ఉంది. వీరికి 9 శాతం రిజర్వేషన్లు కేటాయించారు. గ్రూప్–3 లో 26 కులాలు ఉండగా వీరి జనాభా 33 శాతం ఉంది. ఈ కులాలకు 5 శాతం రిజర్వేషన్ అమలు చేయనున్నారు.