అక్షరటుడే, వెబ్ డెస్క్: ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం నిడమర్రు మండలం క్రొవ్విడిలో రేవ్‌ పార్టీ దృశ్యాలు కలకలం రేపాయి. స్థానిక గ్రామ జనసేన అధ్యక్షుడు ఇంద్రకుమార్‌ పుట్టినరోజు సందర్భంగా రైస్‌ మిల్లులో ఈ నెల 12న రాత్రి రేవ్‌ పార్టీ ఏర్పాటు నిర్వహించారు. అందులో మహిళలు నగ్నంగా డ్యాన్స్‌ చేస్తున్న వీడియోలు వైరల్‌ అయ్యాయి. రాజకీయ విభేదాల నేపథ్యంలో కొంత మంది వీటిని బయటపెట్టినట్లు తెలుస్తోంది. జనసేన గ్రామ అధ్యక్ష పదవి నుంచి ఇంద్రకుమార్‌ను తొలగిస్తున్నట్లు ఆ పార్టీ మండలాధ్యక్షుడు దొరబాబు ప్రకటన విడుదల చేశారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు నిడమర్రు ఎస్‌ఐ వీరప్రసాద్‌ తెలిపారు.