అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: student : తరగతి గదిలో విద్యార్థికి గాయమైనా పాఠశాల సిబ్బంది పట్టించుకోని ఘటన నగరంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. నాల్కల్ రోడ్ లో గల ఓ ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులు ఆడుకుంటుండగా ఓ చిన్నారి నాలుకకు తీవ్రంగా గాయమైంది. అయినా పాఠశాల సిబ్బంది తల్లిదండ్రులకు కనీస సమాచారం ఇవ్వలేదు. బాలుడు ఇంటికి వెళ్లిన తర్వాత చూడగా నాలుకపై తీవ్ర గాయం ఉంది. దీంతో తల్లిదండ్రులు వెంటనే బాలుడిని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. అనంతరం బుధవారం పాఠశాలకు వెళ్లి సిబ్బందిని ప్రశ్నించగా.. నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాలుడి తల్లిదండ్రులు వాపోయారు. చిన్నారికి తీవ్ర గాయమైనా కనీసం సమాచారం ఎందుకు ఇవ్వలేదని అడగగా.. తమకేమీ సంబంధం లేదన్నట్లు మాట్లాడడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
student | విద్యార్థికి గాయమైనా పట్టించుకోని పాఠశాల సిబ్బంది
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి :పీఎం కిసాన్ లబ్ధిదారుల స్టేటస్.. జాబితాలో మీ పేరు లేకపోతే ఏం చేయాలి ?
Advertisement