Earthquake | తెలంగాణలో భూకంపాలు రావు.. క్లారిటీ ఇచ్చిన సైంటిస్ట్​లు

Earthquake | తెలంగాణలో భూకంపాలు రావు.. క్లారిటీ ఇచ్చిన సైంటిస్ట్​లు
Earthquake | తెలంగాణలో భూకంపాలు రావు.. క్లారిటీ ఇచ్చిన సైంటిస్ట్​లు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Earthquake | తెలంగాణ రాష్ట్రం(Telangana)లో భూకంపం వస్తుందని జరుగుతున్న ప్రచారాన్ని అధికారులు కొట్టిపారేశారు. అలాంటి అవకాశమే లేదని తేల్చిచెప్పారు.

Advertisement

తెలంగాణలో రామగుండం(Ramagundam) కేంద్రంగా భూకంపం వస్తుందంటూ వార్తలు వచ్చాయి. దీనిపై జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(NGRI) శాస్త్రవేత్తలు క్లారిటీ ఇచ్చారు. ఈ వార్తలు అవాస్తవం అని అధికారులు తెలిపారు. తమను ఏ సంస్థ సంప్రదించలేదని, తాము ఎవరికీ భూకంపం వస్తుందని చెప్పలేదన్నారు.

ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మి అనవసరంగా భయపడొద్దని ప్రజలకు సూచించారు. ప్రస్తుతం తెలంగాణలో భూకంప సంకేతాలు ఏమి లేవన్నారు. ఏదైనా సమాచారం ఉంటే తాము ప్రజలను అప్రమత్తం చేస్తామన్నారు. రాష్ట్రంలో భూకంపాలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని వివరించారు.

ఇది కూడా చ‌ద‌వండి :  SC Classification | రేపటి నుంచే ఎస్సీ వర్గీకరణ అమలు

కాగా.. ఇటీవల పలు దేశాల్లో భూకంపాలు వచ్చి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో భారత్ లో ముఖ్యంగా తెలంగాణలోని రామగుండంలో భూకంపం రావొచ్చని వార్తలు చక్కర్లు కొట్టాయి.

Advertisement