Old vehicles Scrapping | పాత వాహనాల స్క్రాప్.. కొత్తవి కొనుగోలుపై భారీగా డిస్కౌంట్లు..అవెంటో తెలుసా..?

Old vehicles Scrapping | పాత వాహనాల స్క్రాప్.. కొత్తవి కొనుగోలుపై భారీగా డిస్కౌంట్లు..అవెంటో తెలుసా..?
Old vehicles Scrapping | పాత వాహనాల స్క్రాప్.. కొత్తవి కొనుగోలుపై భారీగా డిస్కౌంట్లు..అవెంటో తెలుసా..?
Advertisement

అక్షరటుడే, హైదరాబాద్: Old vehicles Scrapping : కాలం చెల్లిన వాహనాలు కాలుష్య కారకాలుగా మారుతున్నాయి. పరిసరాలను పొగబారేలా చేస్తున్నాయి. ముఖ్యంగా వాహనదారులు, పాదచారులకు ఊపిరి ఆడకుండా చేసి ఆరోగ్య సమస్యలకు కారణం అవుతున్నాయి. కండీషన్​లో లేని వాహనాల వల్ల ఎక్కడి నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని అందరిలోనూ భయం కూడా ఉంది. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో 15 ఏళ్లు పైబడిన వాహనాలకు ఇంధనం పోయొద్దని ఇంధన బంకులకు అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర సర్కారు సైతం అదే కోవలో వెళ్తోంది.

తెలంగాణ ప్రభుత్వం జనవరి 1, 2025 నుంచి కొత్త వాహన స్క్రాపేజ్ విధానాన్ని(new vehicle scrappage policy) అమలు చేస్తోంది. తద్వారా పాత, కాలుష్య కారకాలు కలిగించే వాహనాలను దశలవారీగా తొలగిస్తోంది.

Old vehicles Scrapping : సర్కారు లక్ష్యం..

తప్పనిసరి ఫిట్‌నెస్ పరీక్షలలో విఫలమయ్యే 15 సంవత్సరాల కంటే పాత వాహనాలను తొలగించడం ప్రధాన ఉద్దేశం. రిజిస్ట్రేషన్, రోడ్లపై వాటి వినియోగం నిరోధించడం ఈ విధానం లక్ష్యం.

Old vehicles Scrapping : ప్రోత్సాహకాలు..

పాత వాహనాలను స్క్రాప్​గా మార్చేసి, స్క్రాపింగ్ చేసినట్లు సర్టిఫికేట్ పొందిన యజమానులు కొత్త వాహనాల కొనుగోలుపై డిస్కౌంట్లకు అర్హులు. తద్వారా రోడ్లపై పాత వాహనాలు తిరగడాన్ని నిరోధించేలా వాహన యజమానులను ప్రోత్సహించడం సర్కారు ప్రధాన ఉద్దేశం.

Old vehicles Scrapping : సదుపాయాల కల్పనకు అడుగులు..

స్క్రాప్ ప్రక్రియను సులభతరం చేయడానికి రాష్ట్రం రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీస్ (Registered Vehicle Scrapping Facilities – RVSFలు), ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు (Automated Testing Stations – ATS) ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.

Old vehicles Scrapping : పాత వాహనాల తొలగింపుతో ప్రయోజనాలు..

పాత వాహనాల స్థానంలో కొత్త, పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలతో భర్తీ చేయాలని సర్కారు యోచిస్తోంది. తద్వారా వాయు కాలుష్యాన్ని తగ్గించడం, రహదారి భద్రతను పెంచడం ఈ కొత్త పాలసీ లక్ష్యం.

Old vehicles Scrapping : పన్ను మినహాయింపు..

పాత వాహనాలను స్క్రాప్ చేయడానికి ఈ పాలసీ పన్ను రాయితీలను కూడా అందిస్తోంది. గ్రీన్ టాక్స్ వంటి వాటిపై మినహాయింపు కూడా ఉంటుంది.

Old vehicles Scrapping : ఆటోమేటెడ్ టెస్టింగ్..

ఫిట్‌నెస్ పరీక్షల కోసం ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ ఆలోచన. దీనివల్ల కచ్చితమైన, పారదర్శక ఫలితాల నిర్ధారణ అవుతుంది.

Old vehicles Scrapping : రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ సౌకర్యాలు (RVSFలు)..

రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్​లోని సౌకర్యాలు సురక్షితమైన, పర్యావరణ అనుకూలమైన వాహనాల స్క్రాపింగ్‌ను ప్రోత్సహిస్తాయి. ఇందుకోసం రాష్ట్రంలో సారథి, వాహన(Sarathi, Vahana) సాఫ్ట్‌వేర్‌ల(softwares)ను అమలు చేయాలని సర్కారు ఆలోచన చేస్తోంది.

Advertisement