అక్షరటుడే, వెబ్‌డెస్క్ YS Viveka Murder Case : ఏపీలో ఇప్పటికీ చర్చనీయాంశం అయిన విషయం ఏదైనా ఉందా అంటే అది వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు (YS Viveka Murder Case) అనే చెప్పుకోవాలి. ఎప్పుడో 2019 లో జరిగిన ఈ హత్య కేసు ఇప్పటికీ ఒక కొలిక్కి రాలేదు. ఆ కేసు విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే రెండు సార్లు ప్రభుత్వాలు కూడా మారాయి కానీ.. ఈ కేసు మాత్రం ముగియడం లేదు. అయితే.. ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి కీలకంగా మారాడు.
అందుకే.. దస్తగిరికి (dastagiri) భద్రతను పెంచాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే దస్తగిరికి భద్రత ఉన్నా.. దాన్ని పెంచాలని పోలీసు అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 1+1 గన్ మెన్ భద్రతను 2+2 కి పెంచాలని నిర్ణయించారు. దానికి సంబంధించి కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మీడియాకు తెలిపారు.
YS Viveka Murder Case : సాక్షుల మరణాల వల్లనే భద్రత పెంచుతున్నారా?
నిజానికి దస్తగిరికి ఇంత సడెన్ గా భద్రతను పెంచాలని పోలీసులు నిర్ణయం తీసుకోవడానికి కారణం.. (YS Viveka Murder Case) వైఎస్ వివేకా హత్య కేసులో సాక్షులుగా ఉన్న పలువురు వ్యక్తులు అనుమానాస్పదంగా ఈ మధ్య మరణించడమే. అందుకే దస్తగిరి తనకు భద్రత పెంచాలని ఎస్పీని కోరడంతో భద్రత పెంచుతున్నట్టు పోలీసులు తెలిపారు. వెంటనే మరో ఇద్దరు గన్ మెన్స్ దస్తగిరి ఇంటి వద్ద కాపాలాగా ఉంటున్నారు. దీంతో మొత్తం నలుగురు గన్ మెన్స్ దస్తగిరి ఇంటి వద్ద సెక్యూరిటీగా తమ విధులను నిర్వర్తిస్తున్నారు.