Advertisement
అక్షరటుడే, నిజాంసాగర్ : Nizamsagar | నిజాంసాగర్ మండలం అచ్చంపేట పంచాయతీ పరిధిలోని మరుపల్లిలో ఇసుక డంప్లను అధికారులు సీజ్ చేశారు. అక్రమంగా ఇసుక డంప్ చేశారనే సమాచారం మేరకు బుధవారం ఆర్ఐ సాయిబాబ ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు.
అనుమతి లేకుండా 18 ట్రాక్టర్ల ఇసుకను తీసుకొచ్చి డంప్ చేశారని గుర్తించారు. కాగా.. ఇసుక డంప్లను సీజ్ చేశామని అధికారులు తెలిపారు. కాగా.. అదే ప్రాంతంలో మరిన్ని ఇసుక నిల్వలు ఉన్నాయని, వాటిని సీజ్ చేయలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
Advertisement