Advertisement
అక్షరటుడే, ఎల్లారెడ్డి: YELLAREDDY | మండలంలోని మల్లాయిపల్లి ప్రాథమిక పాఠశాల(primary school)లో మంగళవారం స్వయంపాలన దినోత్సవాన్ని (self government day) ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులే తమ తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. హెచ్ఎంగా రోహిత్, ఉపాధ్యాయులగా నవనీత్, అవంతిక, సింధూజ, భానుప్రియ, విష్ణువర్ధన్, ప్రశాంత్, ఇందు, జశ్వంత్, సౌమ్య తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విశ్వనాథ్, సహోధ్యాయులు, సంతోష్ తదితరులున్నారు.
Advertisement