అక్షరటుడే, నిజామాబాద్: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు స్వీయ ఆత్మరక్షణపై ఇచ్చిన శిక్షణ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఆదివారం నిజామాబాద్ నగరంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో ఏకకాలంలో 11 వేల మంది మహిళలు, యువతులు, విద్యార్థినిలు శిక్షణలో పాల్గొన్నారు. కాగా ఈ శిక్షణకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కింది. ఈ శిక్షణను ప్రత్యక్షంగా వీక్షించిన ప్రతినిధులు అనంతరం లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో నమోదు చేస్తూ.. జిల్లా జడ్జి సునీత కుంచాలకు మెడల్ బహుకరించారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి ఎస్.గోవర్ధన్ రెడ్డి, సీపీ కల్మేశ్వర్, న్యాయవాది రాజేందర్ రెడ్డి, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రతిమా రాజ్ పాల్గొన్నారు.
