అక్షరటుడే, వెబ్ డెస్క్ : దేశీయ స్టాక్ మార్కెట్లలో పతనం ఆగడం లేదు. ఇండెక్స్‌లు బుధవారం సైతం భారీగా పడిపోయాయి. సెన్సెక్స్ 984 పాయింట్లు నష్టపోయి 77,690 పాయింట్ల వద్ద ముగియగా.. నిఫ్టీ 324 పాయింట్లు నష్టపోయి 23,559 పాయింట్ల వద్ద ముగిసింది. బ్యాంకింగ్, ఆటోమొబైల్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి తీవ్రంగా కనిపించింది. హెవీ వెయిటేజీ ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్‌ల షేర్లు పడిపోవడంతో ఇండెక్స్‌లు కోలుకోలేకపోయాయి. బుధవారం ఎఫ్‌ఐఐలు రూ. 2,502 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా.. డీఐఐలు 6,145 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు. రిటైల్ ద్రవ్యోల్బణం పెరగడంతో వడ్డీ రేట్ల కట్ విషయంలో ఆర్‌బీఐ మరికొంత కాలం వేచి చూసే ధోరణి అవలంబించవచ్చన్న అంచనాలు మార్కెట్లపై ప్రభావం చూపాయని భావిస్తున్నారు. దీంతో బుధవారం సుమారు రూ.8 లక్షల కోట్ల విలువైన ఇన్వెస్టర్ల సంపద ఆవిరయ్యింది.