అక్షర టుడే, వెబ్ డెస్క్ Degree Students : మీరు తెలంగాణలో డిగ్రీ (Degree) చదువుతున్నారా? అయితే మీకు అదిరిపోయే న్యూస్. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అంటే 2025 – 26 నుంచి డిగ్రీ చదివే విద్యార్థులకు (Students) సెమిస్టర్ పరీక్షలు 50 మార్కులకే ఉండనున్నాయి. దీనికి సంబంధించిన సవరణలపై తెలంగాణ (Telangana) ఉన్నత విద్యామండలి తాజాగా నిర్ణయం తీసుకుంది. నిజానికి వచ్చే విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ విద్యలో చాలా మార్పులు చోటు చేసుకోనున్నాయి. తెలంగాణ (Telangana) ఉన్నత విద్యా మండలి చైర్మన్ వి.బాలకృష్ణా రెడ్డి (Balakrishna Reddy) ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో అన్ని యూనివర్సిటీల వైస్ ఛాన్స్లర్లు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో వచ్చే విద్యా సంవత్సరం (Academic year) నుంచి డిగ్రీ (Degree) విద్యలో పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. సిలబస్, Syllabus, Exams, ఎగ్జామ్స్, మార్కుల, Syllabus, Exams, Marks విధానం అన్నింట్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం డిగ్రీ విద్యలో సెమిస్టర్లో ఒక్క పరీక్షకు 100 మార్కులు ఉండేవి. అందులో ఎక్స్‌టర్నల్ ఎగ్జామ్కు 80 మార్కులు, ఇంటర్నల్ పరీక్షకు (Internal examination) 20 మార్కులు ఉండేవి. కానీ, ఇప్పుడు ఆ పద్ధతిని మార్చేశారు. అంటే వచ్చే విద్యా సంవత్సరం నుంచి 50 మార్కులకే ఒక పరీక్ష ఉంటుంది. మిగిలిన 50 మార్కులను ప్రాజెక్ట్ వర్క్ కోసం 25 మార్కులు, మిడ్ టర్మ్ పరీక్షకు 25 మార్కులు కేటాయించారు.
Degree Students : వచ్చే విద్యా సంవత్సరంలో 20 శాతం మార్పులు
వచ్చే విద్యా సంవత్సరంలో (Academic year) 20 శాతం మార్పులు చోటు చేసుకున్నాయి. అందులో భాగంగా ప్రస్తుతం ఉన్న టెక్నాలజీకి అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, రీసెర్చ్ ఆప్టిట్యూట్ లాంటి కోర్సులను కూడా సిలబస్లో చేర్చనున్నారు. అన్ని యూనివర్సిటీలకు ఒకే విద్యా ప్రణాళిక ఉండనుంది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 30 లోపు డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు పూర్తయ్యేలా ప్రణాళికలు ఉంటాయి. దాని వల్ల డిగ్రీ తర్వాత ఉన్నత చదువుల కోసం రాసే ఎంట్రేన్స్ ఎగ్జామ్స్ కి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.