అక్షరటుడే, ఇందూరు: నిజామాబాద్ సెషన్స్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా సీనియర్ న్యాయవాది ధర్పల్లి రాజేశ్వర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రవిగుప్తా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజేశ్వర్ రెడ్డి గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ, నాందేడ్ లా కళాశాలలో ఎల్ఎల్‌బీ పూర్తి చేశారు. గతంలో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా విధులు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడిగా పనిచేశారు. రాజేశ్వర్ రెడ్డిని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ గౌడ్, సీనియర్ న్యాయవాదులు ఆకుల రమేష్, నీలకంఠరావు, గణపతి, గడువు గంగాధర్, రాజకుమార్ సుబేదార్, శ్రీహరి ఆచార్య తదితరులు సన్మానించారు.