అక్షరటుడే, ఆర్మూర్: పార్టీ సభ్యత్వ కార్యక్రమంలో భాగంగా ఆదివారం బీజేపీ సీనియర్ నాయకుడు కోటపాటి నరసింహం నాయుడు జక్రాన్ పల్లి మండలంలో పర్యటించారు. మండల కేంద్రంలో జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి సమక్షంలో జరిగిన మండల సమావేశానికి హాజరయ్యారు. అనంతరం మునిపల్లి, నల్లగుట్ట, నడిమి తండాలను సందర్శించారు. యువకులు మోహన్ నాయక్, అశోక్ నాయక్, నవీన్ తో కలిసి ఆయా పోలింగ్ బూత్ లలో జరుగుతున్న సభ్యత్వ నమోదును పరిశీలించారు. అనంతరం నల్లగుట్ట తండాలో ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమ ప్రసారాన్ని తిలకించారు. బీజేపీ సీనియర్ నాయకుడు రుక్మాజి పాల్గొన్నారు.