అక్షరటుడే, వెబ్ డెస్క్: భాజపా అగ్రనేత మురళీ మనోహర్ జోషిని తాజాగా ఓ వేడుకలో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ కలుసుకుని పాదాభివందనం చేశారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య ఆసక్తికరమైన సంభాషణ చోటుచేసుకుంది. “నిజామాబాద్.. చాలా గొప్ప విషయం.. ఆ పేరు ఇంకా మార్చలేదా(ఆయన ఉద్దేశం ఇందూరుగా పేరు పెట్టలేదా)” అని మురళీ మనోహర్ జోషి అడిగారు. దీనికి ఎంపీ సమాధానమిస్తూ..”అది మా అజెండాలో ఉందండి.. తప్పకుండా చేస్తా” అని చెప్పుకొచ్చారు. ఇరువురి మధ్య జరిగిన ఈ ఆసక్తికరమైన సంభాషణను ఎంపీ అర్వింద్ సామాజిక మాధ్యమ వేదికగా.. “భారతీయ జనతా పార్టీ అగ్రనేత, పెద్దలు మురళీ మనోహర్ జోషితో నా రాజకీయ జీవితంలో చారిత్రాత్మక సంభాషణ.” అని పంచుకున్నారు.