అక్షరటుడే, నిజామాబాద్ నగరం: నిజామాబాద్ అర్బన్ బీఆర్ఎస్ నాయకులు ఎట్టకేలకు కాంగ్రెస్ లో చేరారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సమక్షంలో గురువారం ఉదయం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇద్దరు మహిళా కార్పొరేటర్ల తరపున వారి భర్తలు పంచరెడ్డి సూరి, అరుణ్, నుడా డైరెక్టర్ కన్నా బాలాజీ, మాజీ కార్పొరేటర్లు కొండపాక రాజేష్, పురుషోత్తం, అర్బన్ యూత్ అధ్యక్షుడు బొబ్బిలి మురళి, నాయకులు నాయిని సృజన్, మార ప్రభు, అనిల్ యాదవ్, పసుల సురేష్, పుప్పాల రవి, గంగరాజు, మాకు రవి, అర్ఎల్ నరసింహ, బీఎల్ రాజు తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. నగర అధ్యక్షుడు కేశ వేణు, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామర్తి గోపి, సీనియర్ నాయకుడు నరాల రత్నాకర్ ఆధ్వర్యంలో వీరి చేరిక జరిగింది.
