అక్షరటుడే, వెబ్‌డెస్క్:Senior Congress leader Chidambaram : కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం అస్వస్థతకు లోనయ్యారు. అహ్మదాబాద్ (Ahmedabad)లో జరుగుతున్న సీడబ్ల్యూసీ సమావేశం(CWC meeting)లో పాల్గొనేందుకు వెళ్లి స్పృహ తప్పి పడిపోయారు. 79 ఏళ్ల చిదంబరంను హుటాహుటిన ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
మహాత్మా గాంధీ స్మృతి వనం సబర్మతి ఆశ్రమానికి(Mahatma Gandhi Smriti Vanam Sabarmati Ashram) వెళ్లిన ఆయన.. ఆశ్రమం మైదానంలో నడుస్తున్న సమయంలో సొమ్మసిల్లి పడిపోయారు. కిందపడిపోయిన చిదంబరాన్ని ఎంత లేపేందుకు ప్రయత్నించినా పైకి లేవకపోవడంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు.
కాగా.. ఆయనకు వడదెబ్బ తగలడం వల్లే ఇలా సొమ్మసిల్లి పడిపోయారని వైద్యులు చెప్పారు. గుజరాత్ లో ఎండలు ఎక్కువగానే ఉన్నాయి. అహ్మదాబాద్ లో 40 డిగ్రీల సెల్సియస్ పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.