అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Ameenapoor | అమీన్పూర్లో ముగ్గురు పిల్లల మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రియుడి మోజులో తల్లే తన ముగ్గురు పిల్లలకు విషం పెట్టి చంపినట్లు పోలీసులు గుర్తించారు.
సంగారెడ్డి జిల్లా Sangareddy district అమీన్పూర్లో గత నెల 27న విషాహారం food poisoning తిని ముగ్గురు పిల్లలు చనిపోయిన విషయం తెలిసిందే. తాము పెరుగు తినడంతో పిల్లలు చనిపోయారని, తాను అస్వస్థతకు గురయ్యానని రజిత తెలిపింది. అనంతరం పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు.
Ameenapoor | గెట్ టు గెదర్‌లో కలిసి..
రజిత ప్రైవేట్ పాఠశాలలో private school టీచర్‌గా పని చేస్తుంది. ఇటీవల ఆమె పదో తరగతి చదివిన క్లాస్మేట్స్ గెటు టు గెదర్ నిర్వహించారు. ఇందులో తన స్నేహితుడితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలో భర్తతో పాటు పిల్లలను చంపి ప్రియుడితో ఉండాలని ఆమె ప్లాన్ వేసింది.
ఇందులో భాగంగా పెరుగులో విషం కలిపింది. అయితే భర్త చెన్నయ్య అన్నం తినకుండా బయటకు వెళ్లడంతో పిల్లలకు పెరుగన్నం పెట్టింది. దీంతో ముగ్గురు చనిపోయారు. రజిత తీరుపై పోలీసులకు అనుమానం రావడంతో అదుపులోకి తీసుకొని విచారించగా.. ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె ప్రియుడి పాత్ర ఏమైనా ఉందా వివరాలు సేకరిస్తున్నారు.