Stock Market | సెస్సెక్స్‌ పైపైకి.. భారీ లాభాల్లో ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌

Stock market | గ్లోబల్‌ మార్కెట్లలో కొనసాగిన ర్యాలీ.. భారీ గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ
Stock market | గ్లోబల్‌ మార్కెట్లలో కొనసాగిన ర్యాలీ.. భారీ గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Stock Market | ట్రంప్‌ టారిఫ్‌ల Trump tariff పాజ్‌(Pause) ప్రకటనతో దేశీయ స్టాక్‌ మార్కెట్లలో జోష్‌ కనిపిస్తోంది. సెన్సెక్స్‌(Sensex), నిఫ్టీలు పైపైకి పరుగులు తీస్తున్నాయి. శుక్రవారం ఉదయం 988 పాయింట్ల భారీ లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్‌.. క్రమంగాపై లాభాలను పెంచుకుంటోంది. 296 పాయింట్ల లాభంతో ట్రేడింగ్‌ మొదలుపెట్టిన నిఫ్టీ(Nifty) సైతం స్థిరంగా పెరుగుతోంది. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 1,345 పాయింట్ల లాభంతో 75,292 వేల వద్ద ఉండగా.. నిఫ్టీ 468 పాయింట్ల లాభంతో 22,868 వద్ద కదలాడుతోంది. అన్ని రంగాల షేర్లు రాణిస్తున్నాయి. మెటల్‌, ఫార్మా, ఆటో, ఎనర్జీ షేర్లు భారీగా పెరిగాయి.

Advertisement

Stock Market | అనుకూల పరిణామాలు..

టారిఫ్‌(Tariff)ల అమలు విషయంలో అమెరికా United States కాస్త వెనక్కి తగ్గింది. చాలా దేశాలపై ప్రతీకార సుంకాల అమలును 90 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు మన దేశం అమెరికాతో చర్చలు కొనసాగిస్తోంది. త్వరలోనే తాత్కాలిక బైలేటరల్‌ ట్రేడ్‌ అగ్రిమెంట్‌(Bileteral Trade Agreement) కుదిరే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఇంకో వైపు చైనా, హాంగ్‌కాంగ్‌, మకావు Hong Kong and Macau వంటి దేశాలకు టారిఫ్‌ల ఉపశమనం tariff relief లభించలేదు. ఇది మన ఎగుమతిదారులకు కలిసొస్తుందని అనలిస్టులు పేర్కొంటున్నారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Stock markets | బుల్‌ జోరుకు రికార్డులు బద్దలు.. ఆల్‌టైం హైకి బ్యాంక్‌ నిఫ్టీ

రూపాయి విలువ బలపడుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ గురువారం ఒక్కరోజే 64 పైసలు పెరిగి 86.05కు చేరింది.

అమెరికా United States, చైనా China మధ్య ట్రేడ్‌వార్‌(Trade war) ముదురుతుండడం, రూపాయి విలువ పెరుగుతుండడంతో ఫారిన్‌ ఇన్వెస్టర్లు పునరాలోచనలో పడ్డారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో వారు చైనానుంచి భారత్‌కు తమ పెట్టుబడులను తరలించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.

Stock Market | Gainers

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ BSE Sensex 30 ఇండెక్స్‌లో రెండు స్టాక్స్‌ మినహా మిగిలినవన్నీ లాభాలతో కొనసాగుతున్నాయి. టాటాస్టీల్‌ 4.48 శాతం పెరగ్గా.. కొటక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, పవర్‌ గ్రిడ్‌, ఎటర్నల్‌(జొమాటో) మూడు శాతం లాభపడ్డాయి. ఎన్టీపీసీ, టాటా మోటార్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఎయిర్‌టెల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, సన్‌ఫార్మా, అదాని పోర్ట్స్‌, ఎంఅండ్‌ఎం, రిలయన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎల్‌ అండ్‌టీ, టెక్‌ మహీంద్రా Tech Mahindra రెండు శాతానికిపైగా లాభాలతో కొనసాగుతున్నాయి.

Stock Market | Losers

నెస్లే Nestle 0.8 శాతం, ఆసియా పెయింట్స్‌ Asia Paints 0.7 శాతం నష్టంతో కదలాడుతున్నాయి.

Advertisement