Advertisement
అక్షరటుడే, నిజాంసాగర్: జుక్కల్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం ఎస్ఎఫ్ఐ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి ఎస్.అజయ్ కుమార్ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 55 ఏళ్లుగా ఎస్ఎఫ్ఐ ప్రజాస్వామ్యం, సోషలిజం లక్ష్యాలతో అలుపెరుగని పోరాటాలు చేస్తోందన్నారు. విద్యార్థుల హక్కుల కోసం ఉద్యమించామని గుర్తు చేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు షేక్ ఫిర్దోస్, నాయకులు జునెద్, అక్షయ్, జమీల్, తదితరులు పాల్గొన్నారు.
Advertisement