అక్షరటుడే, కామారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్షిప్ లను విడుదల చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుందని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రజినీకాంత్ అన్నారు. శనివారం కామారెడ్డిలో విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ.8,200 కోట్లకు పైగా ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్షిప్ లు రాకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం బకాయిలు విడుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అరుణ్, అజయ్, నాయకులు మణికంఠ, రాహుల్, నితిన్, సాయికృష్ణ నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  degree college | డిగ్రీ కళాశాలల్లో ప్రాక్టికల్​ పరీక్షలను బహిష్కరిస్తున్నాం