అక్షరటుడే, ఇందూరు: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా అండర్- 17 బ్యాడ్మింటన్ ఎంపికలు ఈ నెల 24న నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి నాగమణి తెలిపారు. కామారెడ్డిలోని ఫారెస్ట్ ఆఫీస్ సమీపంలో ఉన్న బ్యాడ్మింటన్ అకాడమీ లో ఎంపికలు ఉంటాయన్నారు. ఆసక్తి గల వారు ఉదయం 9 గంటలకు ఒరిజినల్ బోనాఫైడ్ తో హాజరుకావాలని సూచించారు. ఇతర వివరాలకు సంతోష్ 9440926006 ను సంప్రదించాలన్నారు.