అక్షరటుడే, ఆర్మూర్‌: కుటుంబ కలహాలతో భీమ్‌గల్‌లో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై హరిబాబు తెలిపిన వివరాల ప్రకారం.. భీమ్‌గల్‌లోని కేసీఆర్‌ కాలనీకి చెందిన షేక్‌ హర్షద్‌(36) పెయింటర్‌ పనిచేసేవాడు. వచ్చిన డబ్బులతో నిత్యం మద్యం సేవిస్తుండేవాడు. దీంతో ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో బుధవారం సైతం మద్యం తాగి రాగా కుటుంబ సభ్యులతో గొడవ జరిగింది. మద్యం మత్తులో రాత్రి ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.