అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : మహారాష్ట్ర ఎన్నికల్లో డబ్బుల వరద పారుతోందని శివసేన నేత పావస్కర్‌ ఆరోపణలు చేశారు. కర్నాటక, తెలంగాణ సరిహద్దులను మూసివేయాల్సిన అవసరం ఉందని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి వందల కోట్ల రూపాయలను మహారాష్ట్రకు తరలిస్తున్న కొంతమంది వ్యక్తులకు కాంగ్రెస్‌ అసెంబ్లీ ఎన్నికల బాధ్యతను అప్పగించిందని ఆరోపించారు. మహావికాస్‌ అఘాడి కూటమికి కర్నాటక, తెలంగాణ నుంచే కాకుండా విదేశాల నుంచి నిధులు వస్తున్నాయని.. వీటిపై దర్యాప్తు చేయాలని పావస్కర్‌ కోరారు.