Sobhan Babu : శోభన్ బాబు తిరస్కరించిన ఈ సినిమాల గురించి మీకు తెలుసా..?

Sobhan Babu : శోభన్ బాబు తిరస్కరించిన ఈ సినిమాల గురించి మీకు తెలుసా..?
Sobhan Babu : శోభన్ బాబు తిరస్కరించిన ఈ సినిమాల గురించి మీకు తెలుసా..?
Advertisement

అక్ష‌ర‌టుడే, వెబ్‌డెస్క్‌ Sobhan Babu : చేస్తే హీరోగానే చేయాలి కానీ సపోర్టింగ్ రోల్స్ అసలు చేయనని అలానే కెరీర్ ముగించారు ఒకప్పటి ఎవర్ గ్రీన్ స్టార్ హీరో శోభన్ బాబు. కృష్ణ, కృష్ణం రాజు లతో సమానమైన క్రేజ్ తెచ్చుకున్న ఆయనకు అప్పట్లో ఉన్న లేడీ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. శోభన్ బాబు సినిమా అంటే చాలు ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు వరుస కడతారు.

ఐతే కెరీర్ లో ఎప్పుడు కూడా లీడ్ రోల్ చేయాలి అనుకున్న శోభన్ బాబు తనని ఆడియన్స్ హీరోగానే గుర్తు పెట్టుకోవాలన్న మాటకి కట్టుబడి ఉన్నారు. అందుకే ఎన్నో అవకాశాలు వచ్చినా కూడా చేయలేదు. ఆయన కోరినంత రెమ్యునరేషన్ ఇస్తానని చెప్పినా చేయలేదు. అలా శోభన్ బాబు మిస్సైన కొన్ని సినిమాల గురించి ఇక్కడ చూద్దాం.

Sobhan Babu : అన్నమయ్య సినిమాలో..

కింగ్ నాగార్జున కె.రాఘవేంద్ర రావు కాంబినేషన్ లో వచ్చిన అన్నమయ్య సినిమాలో కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వెంకటేశ్వరుని పాత్రలో శోభన్ బాబుని అడిగారట. కానీ ఆయన దాన్ని తిరస్కరించారు. ఇదే కాదు మహేష్ నటించిన అతడు సినిమాలో నాజర్ చేసిన పాత్రకు శోభన్ బాబుని అడిగితే అది కాదన్నారు. పవన్ కళ్యాణ్ నటించిన సుస్వాగతం సినిమాలో రఘువరన్ నటించిన ఫాదర్ రోల్ కి ఆ సినిమా డైరెక్టర్ భీమనేని శ్రీనివాస రావు శోభన్ బాబుని అడిగితే ఆయన చేయనని చెప్పారట. ఇదే క్రమంలో బాలీవుడ్ లో అమితాబ్ నటించిన బ్లాక్ సినిమా తెలుగు రీమేక్ లో లీడ్ రోల్ చేయాలని అడిగినా శోభన్ బాబు చేయలేదని తెలుస్తుంది.

ఇది కూడా చ‌ద‌వండి :  Ram : రామ్ కొత్త లుక్ షూటింగ్ వీడియో లీక్.. ఈసారి హిట్టు కొట్టి తీరాల్సిందే అని గట్టిగా ఫిక్స్ అయినట్టు ఉన్నాడుగా..!

అలా తనకు వచ్చిన సపోర్టింగ్ రోల్స్ చాన్స్ లను చేయకుండా శోభన్ బాబు తను పెట్టుకున్న సెంటిమెంట్ కి కట్టుబడి ఉన్నారు. ఐతే ఆయనకు వచ్చిన పాత్రలు సినిమాలు కూడా మంచి కాంబినేషన్ లోనివే.. ఐతే తను హీరోగానే రిటైర్ అవ్వాలి అన్న ఆలోచనని బలంగా అనుకున్న శోభన్ బాబు ఆ తర్వాత ఎలాంటి ఆఫర్ వచ్చినా కూడా చేయలేదు. అందుకే ఆయన ఇప్పటికీ చాలా ప్రత్యేకంగా అభిమానిస్తారు ఆయన ఫ్యాన్స్.

Advertisement