అక్షరటుడే, వెబ్డెస్క్: Wine Shops | మద్యం ప్రియులకు రాచకొండ పోలీసు(Rachakonda Police)లు షాక్ ఇచ్చారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఆదివారం మద్యం దుకాణాలు(Wine Shops) బంద్ చేయాలని నిర్వాహకులను ఆదేశించారు. శ్రీరామ నవమి(Sri Rama Navami) సందర్భంగా ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం దుకాణాలు బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. వీటితో పాటు బార్లు, రెస్టారెంట్లు, కల్లు దుకాణాలు కూడా మూసి వేయాలని స్పష్టం చేశారు.
శ్రీరామ నవమి(Sri Rama Navami) సందర్భంగా హైదరాబాద్ లో ఘనంగా శోభాయాత్ర నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అన్ని చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా మద్యం దుకాణాలను కూడా మూసి వేయాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు రేపు వైన్ షాపులు(Wine Shops) బంద్ అని తెలియడంతో మందుబాబులు దుకాణాలకు క్యూ కడుతున్నారు.