Recharge Tariffs | మొబైల్​ యూజర్లకు షాక్​.. పెరగనున్న రీఛార్జ్ ధరలు

Recharge Tariffs | మొబైల్​ యూజర్లకు షాక్​.. పెరగనున్న రీఛార్జ్ ధరలు
Recharge Tariffs | మొబైల్​ యూజర్లకు షాక్​.. పెరగనున్న రీఛార్జ్ ధరలు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Recharge Tariffs | యూజర్లకు షాక్​ ఇవ్వడానికి టెలికాం telecom కంపెనీలు సిద్ధమయ్యాయి. గతేడాది జూలైలో టారిఫ్​లను పెంచిన ఆయా సంస్థలు మళ్లీ రేట్లు పెంచడానికి యత్నిస్తున్నాయి. గతేడాది జూలైలో మొదట జియో(jio) రీఛార్జ్ రేట్లను పెంచింది. అనంతరం ఎయిర్​టెల్ Airtel​, వీఐ VI కూడా అదే బాటపట్టాయి. దీంతో చాలా మంది యూజర్లు బీఎస్​ఎన్​ bsnlలోకి పోర్టు అయ్యారు. జియో చాలా మంది సబ్​స్క్రైబర్లను కోల్పోయింది. రేట్లు తక్కువగా ఉండడంతో పేద, మధ్య తరగతి వారు బీఎస్​ఎన్​ఎల్​లోకి మారారు.

Advertisement

ఈ ఏడాది కూడా టెలికాం కంపెనీలు రేట్లు పెంచాలని చూస్తున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. ఈ పెంపు 10 శాతం నుంచి 20శాతం వరకు ఉండొచ్చని అంచనా. ప్రస్తుతం ఇతర దేశాలతో పోలిస్తే భారత్​లోనే టెలికాం ధరలు తక్కువగా ఉన్నాయి. మరోవైపు కంపెనీలు వ్యాపారాన్ని నడపాడానికి ఇబ్బందులు పడుతున్నాయి. దీంతో ఈ ఏడాది చివరి వరకు రేట్లు పెంచనున్నట్లు సమాచారం.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Apple TV+ | ఇక భారత్​లోనూ ‘యాపిల్​ టీవీ+’ చూడొచ్చు