అక్షరటుడే, వెబ్డెస్క్: Apple phones | యాపిల్ సంస్థ భారత్లో India తన ఉత్పత్తిని production పెంచింది. చైనాతో China అమెరికాకు US దూరం పెరుగుతున్న తరుణంలో యాపిల్ తన యూనిట్లను భారత్కు మార్చింది. దీంతో ఎక్కువ మొత్తంలో యాపిల్ ఫ్లోన్లు Apple phones ఇండియాలోనే అసెంబుల్ అవుతున్నాయి. ఇందులో ఖరీదైన టైటానియం ప్రో మోడల్స్ కూడా ఉండటం గమనార్హం.
గత ఆర్థిక సంవత్సరంలో యాపిల్ భారతదేశంలో 22 బిలియన్ల billion డాలర్ల విలువైన iPhoneలను అసెంబుల్ చేసింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 60శాతం పెరగడం గమనార్హం. భారత్లో తయారైన ఐఫోన్‌లలో ఎక్కువ భాగం దక్షిణ భారతదేశంలోని South India ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ Foxconn Technology Group ఫ్యాక్టరీలో అసెంబుల్ అవుతున్నాయి. అయితే చైనా, అమెరికా మధ్య ప్రతికార సుంకాల నేపథ్యంలో యాపిల్ ఫోన్ల అసెంబ్లీంగ్ భారత్లో ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.