అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy | నిబంధనలకు విరుద్ధంగా అబార్షన్లకు పాల్పడుతున్న కామారెడ్డి (Kamareddy)లోని సమన్విత(Samanvita) ఆస్పత్రికి హైకోర్టు(High Court) షాకిచ్చింది.
ఈ మేరకు జిల్లా వైద్యాధికారులు కోర్టులో పూర్తి సాక్ష్యాలను ప్రవేశపెట్టగా, విచారించిన న్యాయస్థానం సదరు ఆస్పత్రిలో సేవలు నిలిపేయాలంటూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో అధికారులు ఉత్తర్వులతో ఆస్పత్రికి చేరుకుని యాజమాన్యానికి నోటీసులు ఇవ్వగా వారు నిరాకరించారు. దీంతో ఆస్పత్రి గోడపై అతికించారు.
డీఎంహెచ్ఓ(DMHO Kamareddy) చంద్రశేఖర్ మాట్లాడుతూ.. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న సమన్విత ఆస్పత్రిలో ప్రజలు వైద్యం చేయించుకోవద్దని, సదరు ఆస్పత్రిలో పని చేస్తున్న ప్రభుత్వ వైద్యుడు ప్రవీణ్‌ను క్రమశిక్షణ చర్యలలో భాగంగా కొమురంభీం అసిఫాబాద్ జిల్లాకు బదిలీ చేసినట్లు తెలిపారు.