అక్షరటుడే, వెబ్డెస్క్ : Students | పాలిటెక్నిక్(Polytechnic) చదివే విద్యార్థులకు ఆయా కాలేజీలు షాకిచ్చాయి. కోర్సుల ఫీజులను భారీగా పెంచాయి. రాష్ట్రంలో గత పదేళ్లుగా పాలిటెక్నిక్ కోర్సుల ఫీజులు పెరగలేదు. దీంతో రూ.14,900 ఫీజును ఆయా కాలేజీలు విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్నాయి. అయితే ఫీజులు పెంచాలని పలు కాలేజీలు(Colleges) హైకోర్టు(High Court)ను ఆశ్రయించాయి. దీంతో ఫీజుల పెంపునకు న్యాయస్థానం అనుమతిచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం ఫీజులు పెంచుతూ జీవో జారీ చేసింది.
Students | గరిష్ట ఫీజు ఎంతంటే..
ఇప్పటి వరకు పాలిటెక్నిక్ కాలేజీల్లో ఫీజు రూ.14,900గా ఉండగా.. మొత్తం ప్రభుత్వమే(Government) రీయింబర్స్మెంట్ రూపంలో చెల్లిస్తోంది. అయితే ప్రస్తుతం గరిష్ట ఫీజు రూ.39 వేలకు చేరింది. రాష్ట్రంలోని 55 ప్రైవేట్ కళాశాలలకు ఫీజు నిర్ణయించగా అందులో 43 కాలేజీలకు రూ.39 వేలు ఉంది. మరికొన్ని కాలేజీలకు రూ.25 వేల నుంచి రూ.35 వేలుగా ఉండగా రెండు కాలేజీలకు మాత్రం రూ.14,900, రూ.15 వేలుగా నిర్ణయించారు.
అయితే ఫీజు రీయింబర్స్మెంట్(Reimbursment) కింద ప్రభుత్వం రూ.14,900 మాత్రమే చెల్లిస్తుంది. మిగతా డబ్బులను విద్యార్థులే కట్టుకోవాల్సి ఉంటుంది. కాగా పెరిగిన ఫీజులు 2023-24, 2024-25లతో పాటు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలులో ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది.
Students | దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
పాలిటెక్నిక్ ప్రవేశాల కోసం ప్రభుత్వం పాలీసెట్(Polycet) పరీక్ష నిర్వహిస్తుంది. ఈ ఏడాది పాలీసెట్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 19 నుంచి ఏప్రిల్ 21 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మే 13న పాలీసెట్ ఎంట్రెన్స్ పరీక్ష(Entrance Test) నిర్వహించనున్నారు.