YouTubers | యూట్యూబర్లకు షాక్​.. 11 మందిపై కేసు

YouTubers | యూట్యూబర్లకు షాక్​.. 11 మందిపై కేసు
YouTubers | యూట్యూబర్లకు షాక్​.. 11 మందిపై కేసు
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​: YouTubers | పలువురు ప్రముఖ యూట్యూబర్లకు పోలీసులు షాక్​ ఇచ్చారు. బెట్టింగ్​ యాప్స్​ ప్రమోట్​ చేస్తున్న 11 మందిపై సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు. హర్షసాయి, విష్ణుప్రియ, సుప్రీత, ఇమ్రాన్ ఖాన్, రీతూ చౌదరి, టేస్టీ తేజ, అజయ్, కిరణ్ గౌడ్, బయ్యా సన్నీ యాదవ్, సుధీర్ రాజులపై కేసులు నమోదయ్యాయి.

YouTubers | డబ్బుల కోసం బెట్టింగ్​ యాప్స్​ ప్రమోషన్స్​

పలువురు ప్రముఖ యూట్యూబర్లు డబ్బుల కోసం బెట్టింగ్​ యాప్స్​ను ప్రమోట్​ చేస్తున్న విషయం తెలిసిందే. చట్టబద్దత లేని బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తూ యువత జీవితాలతో ఆడుకుంటున్నారు. వీరిని ఫాలో అవుతున్న ఎంతో మంది ఆ బెట్టింగ్​ యాప్​లలో చిక్కుకొని జీవితాలు నాశనం చేసుకుంటున్నారు.

YouTubers | నమ్మి మోసపోతున్న యువత

ఈ మధ్య కాలంలో బెట్టింగ్ యాప్‌, ట్రేడింగ్ యాప్‌ల మోసాలకు ఎంతో మంది బలవుతున్నారు. షార్ట్ కట్‌లో డబ్బు సంపాదించాలనే ఆశతో బెట్టింగ్​ యాప్​ల వైపు ఆకర్శితులవుతున్నారు. లక్షల రూపాయలు అప్పులు చేసి బెట్టింగ్​లు పెడుతూ నష్టపోతున్నారు. వారితో పాటు తమ కుటుంబాలను రోడ్డుమీదకు తీసుకువస్తున్న ఘటనలు కోకొల్లలు. నిండా మునిగిన తర్వాత ఏం చేయాలో తెలియక కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

ఇది కూడా చ‌ద‌వండి :  harsha sai | త‌ప్పు తెలుసుకున్న హ‌ర్ష సాయి.. బెట్టింగ్ యాప్‌ల‌ని ప్ర‌మోట్ చేయోద్దంటూ పోస్ట్

YouTubers | దృష్టి సారించిన పోలీసులు

బెట్టింగ్​ యాప్​ల ద్వారా మోసపోతున్న ఘటనలు భారీగా పెరిగిపోవడంతో పోలీసులు దృష్టి సారించారు. గత కొన్నిరోజులుగా వరుసగా ఈ యాప్స్​ ప్రమోట్​ చేస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో గతంలో బెట్టింగ్​ యాప్​లను ప్రమోట్​ చేసిన వారు బయటకు వచ్చి ప్రజలకు క్షమాపణలు చెబుతుండడంతో పాటు ఇలాంటి యాప్​లను నమ్మొద్దని చెబుతున్నారు.

Advertisement