అక్షరటుడే, వెబ్డెస్క్ : ACB Raids | అరెస్టు చేయకుండా ఉండేందుకు లంచం డిమాండ్ చేసిన ఓ ఎస్సైని ఏసీబీ(ACB) అధికారులు పట్టుకున్నారు. సూర్యాపేట(Suryapeta) జిల్లా చింతలపాలెం ఎస్సై(SI) అంతిరెడ్డి ఓ వ్యక్తిని అరెస్ట్ చేయకుండా ఉండేందుకు లంచం అడిగాడు. బాధితుడిపై నమోదైన కేసులో నోటీసులు ఇవ్వొద్దంటే రూ.15 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రచించాడు. ఈ క్రమంలో మంగళవారం బాధితుడి నుంచి రూ.10 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఎస్సైని పట్టుకున్నారు.
Advertisement
Advertisement