Advertisement
అక్షరటుడే, భీమ్‌గల్: మండలంలోని సంతోష్ నగర్ తండాలో గురువారం పేకాట స్థావరంపై ఎస్సై మహేష్ కుమార్, సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఈ సమయంలో పేకాడుతున్న నలుగురిని అరెస్ట్ చేసి వారిపై కేసు నమోదు చేశారు. వారి వద్ద నుంచి రూ.18,350 నగదు, 4 సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు.
Advertisement