అక్షరటుడే, ఎల్లారెడ్డి: లింగంపేట మండలం నల్లమడుగులో చోరీకి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. నల్లమడుగుకు చెందిన అబ్దుల్ రహీం ఈనెల 18న ఇంటికి తాళం వేసి బంధువుల ఊరికి వెళ్లాడు. తాళం వేసి ఉండడానికి గమనించిన గాంధారికి చెందిన ర్యాపని ఒడ్డే సాయిలు ఇంట్లోకి చొరబడి బంగారు, వెండి ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లాడు. వేలిముద్రల ఆధారంగా నిందితుడు సాయిలుగా పోలీసులు గుర్తించారు. లింగంపేట బస్టాండ్ లో సోమవారం అతడిని పట్టుకొని చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Nasrullabad police | నస్రుల్లాబాదులో దొంగల బీభత్సం