అక్షరటుడే, కామారెడ్డి గ్రామీణం: బీడీ కార్మికులు సంఘటితంగా ఉద్యమిస్తేనే సమస్యలు పరిష్కరించుకోవచ్చని తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం, బీఎల్‌టీయూ, రాష్ట్ర అధ్యక్షుడు సిద్దిరాములు పేర్కొన్నారు. రాజంపేటలో గురువారం భారీర్యాలీ నిర్వహించి తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షరతుల్లేకుండా రూ. 4,016 జీవన భృతి ఇవ్వాలన్నారు. అనంతరం తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీడీకార్మిక సంఘాల నాయకలు, బీడీ కార్మికులు పాల్గొన్నారు.