అక్షరటుడే, వెబ్‌డెస్క్: Kishan Reddy | తెలంగాణలో ఇప్పటివరకు 10 జాతీయ రహదారులను పూర్తి చేశామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రూ.6,280 కోట్లతో 285 కిలోమీటర్ల కొత్త రహదారులు నిర్మించినట్లు తెలిపారు. పార్లమెంట్ సమావేశాల అనంతరం వీటిని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభిస్తారని చెప్పారు.
Kishan Reddy | ఆర్ఆర్ఆర్పై గడ్కరీతో చర్చించాం
హైదరాబాద్ వెలుపల రీజినల్ రింగ్ రోడ్డు(RRR) కోసం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చర్చించామని కిషన్ రెడ్డితో చర్చించామని తెలిపారు. ఫైనాన్స్‌కు సంబంధించి ట్రైపార్టీ అగ్రిమెంట్ జరగాల్సి ఉందన్నారు. ఈ రోడ్డు కోసం రూ.18,772 వేల కోట్లు అవసరమవుతాయన్నారు. అలాగే రూ. 300 కోట్లతో ఆరాంఘర్ నుంచి శంషాబాద్ వరకు ఆరులైన్ల హైవే పూర్తయ్యిందని వివరించారు. శంషాబాద్‌కు సిగ్నల్ ఫ్రీ రోడ్డుగా మారుతుందని పేర్కొన్నారు. వచ్చేనెలలో BHEL ఫ్లైఓవర్ పూర్తవుతుందని చెప్పారు.