అక్షరటుడే, వెబ్‌డెస్క్ Holi Festival : మనం జరుపుకునే పండుగలలో ప్రతి పండుగకి ఒక్కో నేపథ్యం ఉంటుంది. ఒకటి వ్యవసాయపనులకు సంబంధంగా ఉంటే, మరో పండుగ రుతువులకు సంబంధించినదిగా ఉంటుంది. ప్రకృతిని కొలుచుకునే పండుగ ఒకటైతే, అన్నాచెల్లెల్లు కలిసి జరుపుకునే పండుగ ఇలా ప్రతి పండుగకి ఒక నేపథ్యం ఉంటుంది. హోళి విషయానికి వస్తే ఈ పండుగ వెనక చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. ఈ పండుగ సత్య యుగం నుంచి జరుపుకుంటున్నట్లు హిందూ పురాణాలు తెలుపుతున్నాయి. హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం వస్తుంది. హోలీని ‘హోళికా పుర్ణిమ’గా కూడ చెబుతుంటారు. ఏటా ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున వచ్చే ఈ పండుగను.. హోలీ, కాముని పున్నమి, డోలికోత్సవం అని కూడా అంటారు.
Holi Festival : ఇది అసలు కథ..
వైష్ణవంలో రాక్షసులకు రాజైన హిరణ్యకశిపుడు చాలాకాలం తపస్సు చేసి తనను చంపడం ఇతరులకు దాదాపుగా అసాధ్యమయ్యేలా బ్రహ్మతో వరం పొందాడు. ఆ హిరణ్యకశిపుడు తనను పూజించమని అందరినీ వేధించేవాడు. అయితే అప్పుడు ప్రజలు దేవుళ్ళని ఆరాధించడం మాని తనను మాత్రమే పూజించాలని ఆజ్ఞాపించగా దీనికి విరుద్ధంగా హిరణ్యకశిపుడి సొంత పుత్రుడైన ప్రహ్లాదుడు భగవంతుడైన విష్ణువుకు భక్తుడిగా మారతాడు. హిరణ్యకశిపుడు పలుమార్లు బెదిరించినప్పటికీ ప్రహ్లాదుడు భగవంతుడైన విష్ణువుని ఆరాధిస్తుండేవాడు. దీంతో ప్రహ్లదుడిని అణిచివేసేందుకు హిరణ్యకశిపుడు పలుమార్లు ప్రయత్నం చేశాడు. అతనికి ఎటువంటి హాని జరగలేదు. తన కొడుకుని చంపాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి
అయితే చివరిగా ప్రహ్లాదుడిని హిరణ్యకశిపుడి సోదరీమణి హోలిక ఒడిలో కూర్చోపెట్టి చితిలో కూర్చోవాలని అతడు ఆజ్ఞాపించాడు. అయితే మంటల నుండి రక్షించే శాలువాను హోలిక ధరించడంతో ఆమెకి ఏం కాదు. కాని మంటలు మొదలైనప్పుడు అందరు చూస్తుండగానే హోలిక శాలువా ఎగిరిపోవడం వలన ఆమె మంటల్లో దహనం అవుతుంది. ఆ శాలువా ప్రహ్లాదుడికి కప్పడం వలన అతనికి ఎలాంటి హాని జరగదు. ఇలా ఆ హోలికా మంటల్లో కాలిపోవడం వలన హోలీ పండుగను జరుపుకుంటున్నాం. నేలమీద కానీ నింగిలోకానీ; ఇంటగానీ బయటగానీ; రాత్రిగానీ పగలుకానీ; మనిషిచేతకానీ పశువుచేతకానీ; ఆయుధాలతోగానీ తనకు మరణం రాకూడదని హిరణ్యకశిపుడనే రాక్షసునికి ఉన్న వరం. అయితే హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని విషయంలో అన్ని విధాలా విఫలమై చివరికి ఉక్రోషంతో అతనికి మరణదండనను విధించాడు. .