Singer Kalpana : సింగర్ కల్పన గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. గత రెండు మూడు రోజులుగా నెట్టింట ఆమె గురించి అనేక వార్తలు హల్ చల్ చేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఆత్మహత్య చేసుకుందంటూ మీడియాలో ఊదరగొట్టారు. అయితే కల్పన ఆత్మహత్య చేసుకుందని, తనకి కారణం ఆమె భర్త అని ఒకసారి, కూతురు అని అన్నారు. అయితే కల్పన కాస్త కోలుకోగా ఆమె తాజాగా వీడియో విడుదల చేసింది. తన భర్తపై మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతుందని, దానిని ఆపేయాలని వీడియోలో చెప్పింది కల్పన.
Singer Kalpana : నా భర్త తప్పేమి లేదు..
నేను నా భర్త నా కూతురు సంతోషంగా ఉన్నాం. నాకు ఇప్పుడు 45 సంవత్సరాలు. ఈ వయస్సులో పీహెచ్ డీ, ఎల్ఎల్‌బీ చేస్తున్నాను. నా భర్త సహకారం వల్లనే ఇవన్నీ చేస్తున్నాను. మా కుటుంబం చాలా అన్యోన్యంగా ఉంది. వృతిపరమైన ఒత్తిడి కారణంగా నిద్ర పట్టడం లేదు. అందుకే చికిత్స తీసుకుంటున్నాను. వైద్యులు సూచించిన టాబ్లెట్స్ కాస్త ఓవర్ డోస్ తీసుకున్నాను. అందువలన స్పృహ తప్పి పడిపోయానునా భర్త సకాలంలో స్పందించడం, కాలనీ వాసులు,పోలీసులు సకాలంలో స్పందించడం వలన ఈ రోజు నేను మీ ముందు ఉన్నాను.
త్వరలోనే మళ్లీ నా పాటలతో మీ ముందుకు వస్తాను. ఆయన సహకారం వలన అన్ని రంగాలలో రాణిస్తున్నాను. నా జీవితంలో బెస్ట్ గిఫ్ట్ నా భర్త. నా ఆరోగ్యం గురించి ఎంక్వైరీ చేసిన అందరికి నా కృతజ్ఞతలు అని కల్పన వీడియోలో తెలిపింది. కాగా, కల్పన భర్త ప్రసాద్ చెన్నైలో ఉంటుండటంతో నిజాంపేట్‌లోని ఇంట్లో ఒంటరిగా ఉంటుందామె. హైదరాబాద్ నిజాంపేట్ రోడ్ వర్టెక్స్ ప్రివిలేజ్ విల్లాస్‌లో ఉంటున్న కల్పన.. నిద్రమాత్రలు ఎక్కువ సంఖ్యలో మింగడంతో స్పృహ త్పపింది. సకాలంలో స్పందించిన పోలీసులు అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను వీల్‌చైర్‌లో ఆస్పత్రికి తరలించారు.