తహశీల్దార్ ఆర్.రవీందర్ రావు

Advertisement

SSC, ఇంటర్మీడియట్ మండల టాపర్లకు సత్యశోధక్ పురస్కారాల ప్రదానం

సిరికొండ, అక్షరటుడే: విద్యార్థులు పట్టుదల, ఉన్నత లక్ష్యంతో చదివితే మంచి స్థాయిలో స్థిరపడవచ్చని, జీవితంలో విద్యార్ధి దశ కీలకమైనదని, ఉత్తమ ఆలోచనలకు సృజనాత్మకత తోడైతే అద్భుత విజయాలు సాధించవచ్చని సిరికొండ తహసీల్దార్ ఆర్.రవీందర్ రావు పేర్కొన్నారు. గత విద్యా సంవత్సరం (2023-24) పదవ తరగతి, ఇంటర్మీడియట్ లో సిరికొండ మండల టాపర్స్ గా నిలిచిన విద్యార్థులకు సత్యశోధక్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం సత్యశోధక్ పాఠశాలలో రావుట్ల చిన్న నర్సయ్య నగదు, సత్యశోధక్ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. సత్యశోధక్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఛైర్మన్ ఆర్.నర్సయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తహసీల్దార్ ఆర్ రవీందర్ రావు , గౌరవ అతిథిగా మండల అభివృద్ధి అధికారి కే.ఆర్ మనోహర్ రెడ్డీ హాజరయ్యారు. ఈ సందర్భంగా రవీందర్ రావు మాట్లాడుతూ.. కష్టంతో కాకుండా ఇష్టపడి చదవాలని విద్యార్థులకు సూచించారు. పదో తరగతి, ఇంటర్మీడియట్ ఉన్నత విద్యకు పునాది లాంటివని, ఉన్నత విద్యపైన అవగాహనను పెంచుకొని గొప్ప లక్ష్యాలను నిర్దేశించుకోవాలన్నారు. విద్యార్థులు ఇష్టమైన సబ్జెక్టుకు ప్రాధాన్యమివ్వాలని, సామాజిక మాధ్యమాలకు ముఖ్యంగా చరవాణులకు దూరంగా ఉండాలన్నారు. సమకాళీన పరిస్థితులు ఎలా ఉన్నా.. మంచి నడవడికతో తామర పువ్వుల వలే మలినం లేకుండా వికసించి పరిమళాలు వెదజల్లే సుగంధ సమాజ పౌరులుగా ఎదగలన్నారు. తల్లిదండ్రుల కళ్లలో కాంతులు నింపి విద్యా బోధన చేసిన గురువులకి పేరు ప్రతిష్టలు తెస్తే జీవితం సార్థకమవుతుందన్నారు. గౌరవ అతిథి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు ఆలోచన శక్తిని పెంపొందించుకోవాలని, చదువుతో సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలు పొందవచ్చని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థిలో అంతర్లీనంగా ప్రతిభ దాగి ఉంటుందని, దానిని మెరుగుపరుచుకొని జీవిత లక్ష్యాల వైపు అడుగులు వేయాలన్నారు. అనంతరం గత సంవత్సరం పదవ తరగతి(2023-24)లో 10/10 జి.పి.ఎ. సాధించి సిరికొండ మండల టాపర్లుగా నిలిచిన విద్యార్థులు జి.నిత్యశ్రీ, వి.భార్గవ్ రెడ్డి, కే. దామోదర్, టి.రతీష్(సత్యశోధక్ పాఠశాల) పి.అమూల్య (MJPRS చిమన్ పల్లి), ఇంటర్మీడియట్ లో 917/1000 సాధించి సిరికొండ మండల్ టాపర్ గా నిలిచిన డి.దీప్తి(TSMS సిరికొండ)కి రావుట్ల చిన్న నర్సయ్య స్మారక నగదు పురస్కారం( ఒక్కొక్కరికి రూ.5000/-), ప్రత్యేక జ్ఞాపిక, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్కౌట్స్ & గైడ్స్ రాష్ట్ర ప్రతినిధి కె.సాల్మన్, విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Education Loans | విద్యా రుణాలపై ట్రంప్​ ఎఫెక్ట్​
Advertisement