అక్షరటుడే, వెబ్‌డెస్క్: Liquor Scam | మద్యం కుంభకోణం కేసులో liquor scam case కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డికి vijaya sai reddy సిట్ నోటీసులు జారీ చేసింది. వైసీపీ ycp హయాంలో రాష్ట్రంలో మద్యం కుంభకోణం Liquor Scam జరిగిందని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తుంది. లిక్కర్‌స్కామ్ విచారణ కోసం సిట్‌ను కూడా ఏర్పాటు చేసింది.
ఈ కేసులో ప్రధాన నిందితుడు, జగన్ బంధువు రాజ్ కసిరెడ్డి raj kasireddyకి మూడు సార్లు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో అధికారులు ఆయన ఇంటిపై దాడులు చేసిన విషయం తెలిసిందే. సోమవారం సిట్ అధికారులు హైదరాబాద్‌లోని కసిరెడ్డి ఇల్లు, ఆఫీసుల్లో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో తాజాగా వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఈ నెల 18న విజయవాడ vijayawada సీపీ ఆఫీసులో విచారణకు రావాలని సూచించారు.