
అక్షరటుడే, వెబ్‌డెస్క్ Court Movie : టాలీవుడ్ లో విలన్ల కొరత గురించి తెలిసిందే. స్టార్ హీరోలకు సరైన విలన్ దొరక్కనే బాలీవుడ్ నుంచి డంప్ చేసుకుంటాం. వాళ్లకు సరిగా భాష రాకపోయినా సరే వాళ్లకి ట్రైనింగ్ ఇచ్చి మరీ ఇక్కడ ఛాన్స్ లు ఇస్తాం. కాస్త క్లిక్ అయితే చాలు వారికి కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చి స్టార్ విలన్ ను చేస్తాం. ఐతే తెలుగులో ఒకప్పటి హీరోలు కొందరు విలన్ గా టర్న్ తీసుకుని సక్సెస్ అయ్యారు. అందులో ముఖ్యంగా జగపతి బాబు ఉన్నాడు.
జగ్గు భాయ్ విలన్ గా మారాక ఎక్కువ సినిమాలు చేశాడు. ఆ తర్వాత శ్రీకాంత్ కూడా ఆ ప్రయత్నం చేశాడు. ఇప్పుడు అదే దారిలో శివాజి కూడా చేస్తున్నాడు. బిగ్ బాస్ తర్వాత శివాజి బిజీ అయ్యాడు. లేటెస్ట్ గా నాని నిర్మాణంలో వచ్చిన కోర్ట్ సినిమాలో శివాజి నెగిటివ్ రోల్ చేశాడు. కోర్ట్ సినిమాలో మంగపతి పాత్రలో అతని విలనిజం అదిరిపోయిందన్న టాక్ వస్తుంది.
Court Movie : కోర్ట్ సినిమాకు కొన్ని చోట్ల పెయిడ్ ప్రీమియర్స్
శుక్రవారం రిలీజ్ కాబోతున్న కోర్ట్ సినిమాకు కొన్ని చోట్ల పెయిడ్ ప్రీమియర్స్ వేశారు. సినిమా చూసిన వారంతా కూడా శివాజి విలనిజం అదుర్స్ అంటున్నారు. టాలీవుడ్ కి మరో విలన్ దొరికేశాడని కామెంట్స్ చేస్తున్నారు. ఎలాగైనా సినిమాల్లో మళ్లీ రాణించాలని శివాజి ఫిక్స్ అయ్యారు. అందుకే కోర్ట్ లాంటి సినిమాలో హీరోయిన్ మామ రోల్ చేశాడు.
ఈ సినిమాలో మంగపతి గా శివాజి బెస్ట్ పర్ఫార్మెన్స్ తో మెప్పించారు. కచ్చితంగా కోర్ట్ సినిమా తర్వాత శివాజికి మరిన్ని ఛాన్స్ లు వస్తాయని చెప్పడంలో సందేహం లేదు. కోర్ట్ సినిమాలో హర్ష్ రోషన్, శ్రీదేవి, ప్రియదర్శి ఇలా అందరు తమ బెస్ట్ ఇచ్చారు. సినిమాకు ప్రీమియర్స్ తో పాజిటివ్ టాక్ వచ్చింది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.