GHMC | హైదరాబాద్ సిటీలో త్వరలో అందుబాటులోకి ఆరు లేన్ల ఫ్లైఓవర్​

GHMC | హైదరాబాద్ సిటీలో త్వరలో అందుబాటులోకి ఆరు లేన్ల ఫ్లైఓవర్​
GHMC | హైదరాబాద్ సిటీలో త్వరలో అందుబాటులోకి ఆరు లేన్ల ఫ్లైఓవర్​

అక్షరటుడే, హైదరాబాద్: GHMC | హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డును Hyderabad Outer Ring Road కొండాపూర్‌కు కలిపే కీలకమైన ఆరు లేన్ల ఫ్లైఓవర్ six-lane flyover పనులు పూర్తికావొచ్చాయి. ఈ నెల చివరి నాటికి సిద్ధం కాబోతోంది. దాని నిర్మాణ గడువు ముగిసినా.. దాదాపు ఒక సంవత్సరం తర్వాత అందుబాటులోకి రాబోతోంది.

Advertisement

స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (SRDP) కింద ఈ ​ అనుసంధాన ఫ్లైఓవర్‌ను connecting flyover నిర్మించారు. రూ.178 కోట్లతో వెంకట్ రావు ఇన్‌ఫ్రా నిర్మాణం చేపడుతోంది. ఈ ఫ్లైఓవర్‌ను వచ్చే నెలలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి CM Revanth Reddy ప్రారంభించనున్నారు.

ఈ ఫ్లైఓవర్​ను 1.2 కి.మీ. పొడవుతో దీనిని నిర్మించారు. ఇది అందుబాటులోకి వస్తే.. గచ్చిబౌలి జంక్షన్‌లోని Gachibowli Junction రద్దీ తగ్గుతుంది. ఏళ్లనాటి ట్రాఫిక్​ సమస్యలు traffic problems పరిష్కారం అవుతాయి. హైటెక్ సిటీ, ఫైనాన్స్ డిస్టిక్​ Hi-Tech City and Finance District కనెక్టివిటీ మరింత మెరుగుపడుతుంది.

ఇది కూడా చ‌ద‌వండి :  Outsourcing jobs | దుబాయ్​ హతుల కుటుంబ సభ్యులకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు!

GHMC లెక్క ప్రకారం.. నిర్మాణ పనులు construction చివరి దశకు చేరాయి. ఏడాది క్రితమే పనులు పూర్తి కావాల్సి ఉండగా.. ఆలస్యానికి గల కారణాలను అధికారులు వివరించారు. “నిర్మాణ ప్రక్రియలో భాగంగా రూ. 2.78 కోట్లు చెల్లించినప్పటికీ, TSSPDCL ద్వారా యుటిలిటీ బదిలీ ఆలస్యం అయింది. చివరకు, GHMC కమిషనర్ కె. ఇలంబరితి ghmc commissioner ilambarti జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించారు..” అని ఒక కార్పొరేషన్‌ అధికారి చెప్పినట్లు డెక్కన్ క్రానికల్ కథనం.

GHMC డేటా పరిశీలిస్తే.. గచ్చిబౌలి జంక్షన్‌లో 2019లో పీక్ అవర్ ట్రాఫిక్ గంటకు 9,806 ప్యాసింజర్ కార్ యూనిట్లు (PCU)గా ఉంది. దీని తీవ్రత 2036 నాటికి గంటకు 17,711 PCUకు చేరుకుంటుందని అంచనా వేశారు. ఆరు లేన్ల ఈ ఫ్లైఓవర్​ అందుబాటులోకి వస్తే, ఈ రద్దీ సమస్యకు పరిష్కారం దొరికినట్లేనని అధికారులు భావిస్తున్నారు.

Advertisement