అక్షరటుడే, ఆర్మూర్: మండలంలోని చేపూర్లో పిచ్చికుక్కలు రెచ్చిపోయాయి. ఆదివారం గ్రామానికి చెందిన ఏడుగురిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. క్షతగాత్రులను వెంటనే ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి సిఫార్సు చేశారు. కుక్కల స్వైరవిహారంపై గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు జిల్లాల్లోనూ వరుస ఘటనలు జరుగుతున్నాయి. ఫిర్యాదులు అందుతున్నా వీధికుక్కలను నియంత్రించడంలో యంత్రాంగం విఫలమవుతోంది.