అక్షరటుడే, వెబ్ డెస్క్: బోధన్ పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. కారులో ఊపిరాడక ఓ బాలుడు మృతి చెందాడు. రాకాసిపేట్ కు చెందిన రాఘవ(6) రెండ్రోజుల కిందట తప్పిపోయాడు. ఆదివారం రాత్రి ఓ కారులో మృతదేహం లభ్యమైంది. బాలుడి తల్లి రేణుకా ఓ ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తుండగా.. బాలుడు ఆడుకుంటూ వెళ్లి సమీపంలోని రోడ్డుపై నిలిపిన కారులో ఎక్కాడు.అనంతరం కారు తలుపునకు తాళం పడింది. దీంతో ఊపిరాడక కారులోనే బాలుడు మృతిచెందాడు. వాహన యజమాని, స్థానికులు కారులో మృతిచెందిన బాలుడిని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వీరయ్య తెలిపారు.