అక్షర టుడే, వెబ్ డెస్క్ Slice Bank : మీరు స్లైస్ (Slice Bank) అనే పేరు విన్నారా? లోన్ యాప్స్ నుంచి లోన్స్ తీసుకునే వాళ్లకు ఈ పేరు సుపరిచితమే. స్లైస్ అనే యాప్ ద్వారా చాలా మంది చిన్న చిన్న లోన్లు తీసుకుంటూ ఉంటారు. ఇది ఒక ఫైనాన్సియల్ టెక్ బ్యాంక్. ఇప్పుడు ఇది నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ (North East Small Finance) బ్యాంక్ తో కలిసి ఒక కొత్త బ్యాంకింగ్ సంస్థను భారత్ లో ఏర్పాటు చేసింది. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించుకొని డిజిటల్ బ్యాంక్ సేవలు దేశంలో ఉన్న అర్బన్, రూరల్ ప్రాంత ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఈ బ్యాంక్ ను ఏర్పాటు చేశారు.
ఇప్పటి వరకు మనం చాలా బ్యాంకులను చూశాం. డిజిటల్ బ్యాంకులు (Digital banks) కూడా కుప్పలు కుప్పలుగా వచ్చి పడ్డాయి. అందుకే ఇతర ఏ బ్యాంకులు ఇవ్వని సర్వీసులను ఈ బ్యాంక్ అందివ్వనుంది. నిమిషంలో బ్యాంక్ సేవింగ్స్ ఖాతా (Bank savings account) తెరవచ్చు. అది కూడా ఎక్కడికీ వెళ్లకుండా. 100 శాతం డిజిటల్ కేవైసీ. క్రెడిట్ సదుపాయం కూడా ఉంటుంది. అన్ని మెట్రో నగరాల్లో త్వరలోనే బ్రాంచ్‌లను కూడా ఏర్పాటు చేయనున్నారు.
Slice Bank : 9 శాతం వరకు ఫిక్స్డ్ డిపాజిట్‌పై వడ్డీ
చాలా బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్‌పై (Fixed Deposit) తక్కువ వడ్డీని ఇస్తాయి. కానీ, ఈ బ్యాంక్ మాత్రం 9 శాతం వరకు వడ్డీని అందిస్తుంది. యాప్ ద్వారా చాలా సులభంగా (Fixed Deposit) ఫిక్స్డ్ డిపాజిట్స్ తీసుకోవచ్చు. పర్సనల్ క్రెడిట్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఎంటర్ ప్రైజ్ లోన్స్ కూడా అందిస్తారు. ఏఐ ఆధారిత ఫైనాన్షియల్ ప్లానింగ్ టూల్స్ ని ఇందులో భాగంగా అందిస్తున్నారు. అందుకే ఇది కేవలం కొత్త బ్యాంక్ మాత్రమే కాదు.. బ్యాంక్ కే కొత్త మార్గం అంటూ స్లైస్ బ్యాంక్ చెబుతోంది.